ఫెస్టివల్స్ టార్గెట్ చేసిన 'లెనిన్'

అక్కినేని హీరో అఖిల్ ఇప్పటివరకు చూసిన స్టైలిష్ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా, మాస్ యాక్షన్ అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 'లెనిన్' చిత్రం అఖిల్ కెరీర్లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే విశ్వాసంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంతో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతాన్ని కథకు వేదికగా తీసుకుని రూపొందుతోంది.
ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అంతా చిత్తూరు యాసలోనే ఉండనుందని సమాచారం. ఇది అఖిల్‌కి కొత్త ఛాలెంజ్‌గా మారబోతోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, ఆమెతో అఖిల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సినిమాకు స్పెషల్ హైలైట్ కానున్నాయని టాక్.
మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సినిమాలో ఓ కీలక అతిథి పాత్ర ఉండబోతోందని, ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించినట్టు సమాచారం. ఇది అఖిల్ సినిమాకు పాన్-ఇండియా స్థాయిలో మరింత బజ్ తెచ్చే అంశంగా మారనుంది.
ఏప్రిల్ లో అఖిల్ బర్త్‌డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళి బరిలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
-
Home
-
Menu