లావణ్య ‘సతీ లీలావతి‘ ఫస్ట్ లుక్!

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా ప్రొఫెషనల్ లైఫ్ ను కొనసాగిస్తుంది. కథ నచ్చితే సినిమా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతుంది. ఈ లిస్టులో లావణ్య నుంచి రాబోతున్న సినిమా ‘సతీ లీలావతి‘. మలయాళీ నటుడు దేవ్ మోహన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
‘భీమిలీ కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి‘ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడటానికి ప్రధాన కారణం మానవ సంబంధాల్లో భావోద్వేగాల యొక్క లోపమే. రెండు వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన భార్యాభర్తలు కలిసి జీవించాలంటే, వారిలో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ మరింత బలంగా ఉండాలి. ఇదే అంశాన్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించబోతున్నామని చెబుతుంది టీమ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మిక్కీ జె మేయర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ టీజర్ రిలీజ్ చేశారు.
-
Home
-
Menu