లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' ప్రారంభం!

లావణ్య త్రిపాఠి సతీ లీలావతి ప్రారంభం!
X
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సతీ లీలావతి'. ఈ సినిమాలో మలయాళీ స్టార్ దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకుడు.

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సతీ లీలావతి'. ఈ సినిమాలో మలయాళీ స్టార్ దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ & ట్రియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు 'సతీ లీలావతి' మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రారంభ వేడుకలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, ఆనంద ప్రసాద్, అన్నే రవి వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి హరీష్ పెద్ది క్లాప్ కొట్టగా, వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ డైరెక్టర్ టి.ఎల్‌.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈరోజు నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది.

Tags

Next Story