'లైలా'ను వెంటాడుతోన్న కాంట్రవర్శీ!

లైలాను వెంటాడుతోన్న కాంట్రవర్శీ!
X
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫిబ్రవరి 14న విడుదలకానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫిబ్రవరి 14న విడుదలకానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో చిరు ప్రసంగం హైలైట్‌గా నిలిచింది. అలాగే ఈ వేడుకలో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

'లైలా'లో మేకల సత్యం పాత్ర పోషించిన పృథ్వీ, తన పాత్ర గురించి వివరిస్తూ చిత్రీకరణ సమయంలో 150 మేకలు ఉన్నాయనీ, ఓ సీన్ తర్వాత మిగిలింది 11 మాత్రమేనని హాస్యంగా వ్యాఖ్యానించాడు. అయితే ఇది 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 11 అసెంబ్లీ సీట్లను ఉద్దేశించిన సెటైర్ అని భావించి వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పృథ్వీ వ్యాఖ్యల నేపథ్యంలో '#BoycottLaila' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పృథ్వీ క్షమాపణ చెప్పాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆసక్తికరంగా అల్లు అర్జున్ అభిమానులు సైతం ఈ వివాదాన్ని ట్రెండ్ చేస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story