'లేడీస్ టైలర్' జంట 'షష్టిపూర్తి'

లేడీస్ టైలర్ జంట షష్టిపూర్తి
X
క్లాసిక్ కామెడీ ‘లేడీస్ టైలర్’లో రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా నటించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో 39 సంవత్సరాల విరామం తరువాత వస్తోన్న మూవీ 'షష్టిపూర్తి'.

మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ చిత్రంలో రూపేష్ కథానాయకుడిగా నటించగా ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తుంది. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విశేషమేంటంటే క్లాసిక్ కామెడీ ‘లేడీస్ టైలర్’లో రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా నటించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో 39 సంవత్సరాల విరామం తరువాత వస్తోన్న మూవీ ఇది. 'లేడీస్ టైలర్'కి సంగీతాన్ని సమకూర్చిన మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండటం మరో విశేషం.

ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ‘షష్టిపూర్తి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. వినోదాన్ని, భావోద్వేగాన్ని సమపాళ్లలో కలిపినట్టున్న టీజర్ ఆకట్టుకుంటోంది.



Tags

Next Story