వంద కోట్ల క్లబ్‌లో 'కుబేర'

జూన్ 20న విడుదలైన ‘కుబేర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్‌ను కొనసాగిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మల్టీస్టారర్ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ధనుష్ ‘దేవా’గా, నాగార్జున ‘దీపక్’గా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ధనుష్ భిక్షగాడిగా కనిపించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఒక అతి ధనవంతుడికి, ఓ నిరుపేద వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఎమోషనల్ టచ్‌తో రూపొందిన ఈ కథకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.
'రాయన్' తరువాత ‘కుబేర’తో మరోసారి వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు ధనుష్. సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025
Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/ikfu2seP5C
-
Home
-
Menu