'కుబేర' ఆడియో లాంఛ్!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ 'కుబేర'. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ కలయికలో రాబోతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
జూన్ 20న రిలీజ్ కు రెడీ అవుతున్న 'కుబేర' ప్రమోషన్స్ జోరందుకుంటున్నాయి. ఇందులో భాగంగా జూన్ 1న చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ లెవెల్లో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో చిత్రబృందం అంతా సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రతీ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన శైలిలో 'కుబేర'ను తెరకెక్కించినట్టు ప్రచార చిత్రాలతో అర్థమవుతుంది. ముఖ్యంగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వడం.. ఇప్పటికే వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో 'కుబేర' ఫుల్ ఆల్బమ్ ఎలా ఉండబోతుంది అనే అంచనాలు పెరుగుతున్నాయి.
Chennai… ready aa? Vera maari kuthu night waiting! 🔥
— Aditya Music (@adityamusic) May 28, 2025
Come witness the blockbuster audio launch of #Kuberaa in all its glory!
🗓 June 1st
📍 Leo Muthu Indoor Stadium, Sri Sai Ram Institute of Technology
In cinemas June 20, 2025.#Kuberaa #SekharKammulasKuberaa… pic.twitter.com/omxWvoFuae
-
Home
-
Menu