బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న 'కొత్త లోక'

బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న కొత్త లోక
X

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో, దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళ ఫాంటసీ హారర్ డ్రామా "కొత్త లోక". కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌ అయిన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటేసింది.

మలయాళంలో "లోక", తెలుగులో "కొత్త లోక" పేరుతో విడుదలైన ఈ చిత్రం, కేరళలో బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో కొనసాగుతుండగా, తెలుగులోనూ కేవలం ఒక వారం లోపే సుమారు రూ.6 కోట్ల వసూళ్లు సాధించింది. వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్లు బలంగా రావడం సినిమా లాంగ్ రన్‌కు పాజిటివ్‌గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం "మహానటి, రుద్రమదేవి, అరుంధతి, భాగమతి" వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వసూళ్లను అధిగమించి ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై విడుదల చేశారు. రెండో వారం రన్ కూడా బలంగా ఉంటే, "కొత్త లోక" మరో కొత్త మైలురాయిని సృష్టించడం ఖాయం.

Tags

Next Story