నాగచైతన్యతో కొరటాల శివ

నాగచైతన్యతో కొరటాల శివ
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'దేవర' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా సీక్వెల్‌పై ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేశారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'దేవర' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా సీక్వెల్‌పై ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేశారు. తారక్ కూడా జపాన్ ప్రమోషన్స్‌లో పార్ట్ 2 పక్కా వస్తుంది అని చెప్పడంతో అభిమానులు ఫుల్ హైప్‌లో ఉన్నారు. కథలోని అసలు ట్విస్ట్ రెండో పార్ట్‌లోనే ఉంటుందని దర్శకుడు స్వయంగా చెప్పడం కూడా అంచనాలను పెంచింది.

అయితే ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నటిస్తున్న 'డ్రాగన్' భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2026 జూన్‌లో విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మైథలాజికల్ మూవీ ఉంది. ఇంకా.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సి ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా పైప్‌లైన్లో ఉంది. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్-కొరటాల కాంబోలో 'దేవర 2' ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది.

ఈ గ్యాప్‌లోనే కొరటాల శివ మరో ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అవేంటంటే— నాగచైతన్యతో సినిమా. తాజాగా కొరటాల, చైతూకి ఒక స్క్రిప్ట్ నేరేట్ చేసినట్లు టాక్. అది పూర్తిగా మాస్ డ్రామాగా ఉండబోతుందట. చైతూ కూడా ఆ కథ విని ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నాగచైతన్య NC24 సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి 'వృషకర్మ' అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ సినిమా తర్వాత తన 25వ చిత్రాన్ని స్పెషల్‌గా ప్లాన్ చేయాలని చైతూ ఆలోచిస్తున్నాడు. ఈ సందర్భంలో కొరటాల చెప్పిన కథ నచ్చడంతో, ఆయనతోనే తన మైల్‌స్టోన్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట. నాగచైతన్య-కొరటాల కాంబోపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story