బెంగళూరు షెడ్యూల్ ప్రారంభమైంది !

బెంగళూరు షెడ్యూల్ ప్రారంభమైంది !
X
‘‘గోవాలోని ముఖ్యమైన షెడ్యూల్ ముగిసిన తర్వాత... కియారా అద్వానీ, యష్ ఇప్పుడు బెంగళూరుకు చేరుకున్నారు.

‘కేజీఎఫ్’ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా గురించి సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ మలయాళ దర్శకురాలు గీతూ మోహందాస్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా బృందం బెంగళూరు షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇటీవల, గోవాలో కియారా అద్వానీ, యష్‌పై ఓ గ్లామరస్ పాట చిత్రీకరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఈ పాటను కంపోజ్ చేశారు.

ఇక ఈ సినిమా కీలకమైన భాగం బెంగళూరులో చిత్రీకరించనున్నారు. ‘‘గోవాలోని ముఖ్యమైన షెడ్యూల్ ముగిసిన తర్వాత... కియారా అద్వానీ, యష్ ఇప్పుడు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ షెడ్యూల్ చాలా కీలకమైనది. కథలో అత్యంత కీలకమైన సన్నివేశాల్ని ఇక్కడే చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో యష్, కియారా ఇద్దరి ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆ విషయాన్ని నటుడు అక్షయ్ ఒబెరాయ్ ధృవీకరించారు.

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ స్థానంలో నయనతారను ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అత్యధిక అంచనాలు నెలకొల్పిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025 చివర్లో విడుదల కావొచ్చని భావిస్తున్నారు.

Tags

Next Story