క్యాన్సర్‌పై విజయం – శివరాజ్ కుమార్ ధైర్యగాథ!

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ క్యాన్సర్‌ను అధిగమించి మళ్లీ సినిమా లోకంలోకి అడుగుపెడుతున్నారు. గత ఏప్రిల్‌లో క్యాన్సర్ నిర్ధారణ అయినా కూడా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని, చికిత్స కొనసాగిస్తూనే షూటింగ్‌లను పూర్తిచేశారు. కీమోథెరపీ సమయంలోనూ చిత్రీకరణలో పాల్గొనడం ఆయన మనోధైర్యాన్ని చాటింది.
ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యానికి మరింత దగ్గరయ్యేందుకు యోగా, ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తున్నారట. మార్చి 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి ప్రవేశించనున్న శివన్న, మార్చి 5న హైదరాబాద్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ మొదలుపెడతారట. RC16లో ఆయన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఆయనే తెలిపారు.
క్యాన్సర్‌ను జయించి మళ్లీ బిజీగా మారుతున్న శివన్న సంకల్పశక్తి, పోరాటస్ఫూర్తి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన పూర్తి ఆరోగ్యంతో మరింత శక్తివంతంగా వెండితెరపై సందడి చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు
-
Home
-
Menu