‘వడచెన్నై 2’ ఎప్పుడు మొదలవుతుంది?

‘వడచెన్నై 2’ ఎప్పుడు మొదలవుతుంది?
X
తాజాగా చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో వెట్రిమారన్ ‘వడచెన్నై 2’ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్‌ను వెల్లడించాడు.

2018లో నేషనల్ అవార్డ్ వచ్చిన ధనుష్ అండ్ వెట్రిమారన్ కాంబోలోని కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘వడచెన్నై’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఐకానిక్ చిత్రానికి సీక్వెల్ గురించి చాలా సంవత్సరాలుగా అభిమానులు, సినీ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్‌గా ఉంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో వెట్రిమారన్ ‘వడచెన్నై 2’ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్‌ను వెల్లడించాడు.

మరో స్టార్ హీరో .. సింబుతో తన తదుపరి ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుందని, ఆ సినిమా పూర్తయిన వెంటనే ధనుష్‌తో ‘వడచెన్నై’ సీక్వెల్ షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు వెట్రిమారన్ తెలిపాడు. ఆ ప్రకటనతో సింబు ధనుష్ స్థానంలో ‘వడచెన్నై 2’ లో నటిస్తున్నాడన్న వైరల్ ఊహాగానాలకు తెరపడింది.

మొదటి భాగంలో ఆండ్రియా, అమీర్, కిషోర్, సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. మరి ‘వడచెన్నై 2’ మూవీ ఎప్పటి నుంచి మొదలవుతుంది అన్న విషయాలు త్వరలోనే తెలుస్తాయి.

Tags

Next Story