మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చిన వెట్రిమారన్

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల తన నిర్మాణ సంస్థ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీని మూసివేస్తున్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ప్రస్తుతం యస్టీఆర్ 49 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసం వెట్రిమారన్, శింబు కలిసి చిత్రీకరించిన ఒక ప్రత్యేక ప్రోమో అక్టోబర్ 4న విడుదల కానుంది.
తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, సంచలనాత్మక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ యస్టీఆర్ 49 చిత్రానికి సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. వెట్రిమారన్ తన కెరీర్‌లో ఎక్కువగా జి.వి. ప్రకాష్ కుమార్ తో కలిసి పనిచేశారు, అయితే ఈ శింబు చిత్రంతో దర్శకుడు కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాతో శింబు కూడా అనిరుధ్‌తో మొదటిసారి కలిసి పనిచేయనున్నాడు. గతంలో, శింబు, వెట్రిమారన్‌ల చిత్రం 'వడ చెన్నై 2' అని వదంతులు వచ్చాయి, కానీ దర్శకుడు వాటిని తోసిపుచ్చారు. యస్టీఆర్ 49 పనులు పూర్తయిన తర్వాత, వెట్రిమారన్ 'వడ చెన్నై 2' తో ముందుకు వెళ్తారు.
-
Home
-
Menu