తొలిసారిగా మెగా ఫోన్ పట్టనున్న వరలక్ష్మీ శరత్ కుమార్

తొలిసారిగా మెగా ఫోన్ పట్టనున్న వరలక్ష్మీ శరత్ కుమార్
X
వారి తొలి ప్రయత్నానికి 'సరస్వతి' అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి వరలక్ష్మి శరత్‌కుమార్ కేవలం నిర్మాతగానే కాకుండా, దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో కూడా నటిస్తోంది.

'క్రాక్', 'వీర సింహారెడ్డి' వంటి చిత్రాలలో తన ప్రభావవంతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఇప్పుడు ఆమె కొత్త సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఆమె నిర్మాతగా, దర్శకురాలిగా రంగ ప్రవేశం చేస్తోంది. ఆమె తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి 'దోస డైరీస్' అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించింది.

వారి తొలి ప్రయత్నానికి 'సరస్వతి' అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి వరలక్ష్మి శరత్‌కుమార్ కేవలం నిర్మాతగానే కాకుండా, దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో కూడా నటిస్తోంది. ఒక హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా ప్రచారం అవుతున్న 'సరస్వతి'లో ప్రకాష్ రాజ్, ప్రియమణి, మరియు నవీన్ చంద్ర వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా.. సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడానికి జట్టులో చేరారు.

Tags

Next Story