ఉపేంద్ర ‘భార్గవ’ కన్నడ చిత్రం ప్రారంభం!

ఉపేంద్ర ‘భార్గవ’ కన్నడ చిత్రం ప్రారంభం!
X
ఈ సినిమా ఒక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఇందులో ఉపేంద్ర యాక్షన్ అవతారంతో అభిమానులను అలరించనున్నారు.

రియల్ స్టార్ ఉపేంద్ర, ప్రముఖ దర్శకుడు నాగన్న కాంబో చిత్రం ‘భార్గవ’ తాజాగా అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత కేపీ సురప్ప బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 23 నుంచి షూటింగ్ దశలోకి అడుగు పెట్టనుంది. ఇది అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్. ప్రస్తుతం ఉపేంద్ర బహుముఖ ప్రాజెక్టులతో సూపర్ బిజీగా ఉన్నారు. కూలీ సినిమాతో పాటు, తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ తన సత్తా చాటుతున్నారు.

అయినప్పటికీ.. ‘భార్గవ’ కోసం త్వరలోనే సెట్స్‌ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమా ఒక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఇందులో ఉపేంద్ర యాక్షన్ అవతారంతో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అంకితా అమర్ నటిస్తున్నారు. ఆమె ఈ సినిమాతో ఉపేంద్రతో తొలిసారి స్క్రీన్ షేర్ చేస్తూ.. తన నటనతో కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఇక బహుభాషా నటుడు అర్పిత్ రంకా ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా ఎంపికైనట్లు తెలిస్తోంది. అర్పిత్ ఇప్పటికే బహుభాషా చిత్రాల్లో తన మార్క్ చూపించారు. ప్రస్తుతం ఆయన రాబోయే తెలుగు డివోషనల్ మూవీ ‘కన్నప్ప’ లో విలన్‌గా నటిస్తున్నారు. గతంలో చిరంజీవి సర్జా నటించిన అజిత్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన అర్పిత్.. భార్గవలో మాత్రం కన్నడ సినిమాల్లో తొలిసారి ఫుల్‌ఫ్లెడ్జ్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఉపేంద్రకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Tags

Next Story