అల్లు- అట్లీ మూవీలో తమిళ స్టార్ కమెడియన్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సై ఫై యాక్షన్ మూవీ ప్రారంభం నుంచి బాగా సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం.. తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ఈ సినిమా తారాగణంలో చేరాడని టాక్.
ఆలు అర్జున్‌తో పాటు ప్రముఖ నటి మృణాళ్ ఠాకూర్‌తో కలిసి ఆయన తన పాత్రల షూటింగ్‌ను ముంబైలో ఇప్పటికే ప్రారంభించారు. ఈ సై-ఫై అడ్వెంచరస్ థ్రిల్లర్‌లో అట్లీ యోగి బాబు కామిక్ టాలెంట్‌ను ఎలా చూపించబోతున్నాడనేది చూడాల్సిన విషయం. ఈ సినిమాలో రష్మికా మందన్నా కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మితమవుతోంది. యంగ్ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ విజువల్ వండర్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుత బజ్ ప్రకారం, ఈ సినిమాను 2027 సంక్రాంతి విడుదలకు నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
Home
-
Menu