తమిళనాట నాగ్ క్రేజ్ మామూలుగా లేదు

నాగార్జున అక్కినేని తన లేటెస్ట్ సినిమా ‘కూలీ’ లో సైమన్ పాత్రతో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. సినిమా సూపర్ హిట్ అవుతున్నప్పటికీ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నాగార్జున నటనే. ముఖ్యంగా తమిళనాడులో. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నాగార్జున స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను కొనియాడుతూ ఫ్యాన్స్ ట్రిబ్యూట్స్, ఎడిట్స్, రీల్స్‌తో నిండిపోయాయి. తమిళ ప్రేక్షకులు నాగార్జునను రెండు చేతులతో స్వాగతించారు.
దీంతో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా పెరిగింది. ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్ నుండి వస్తున్న ప్రశంసలు అదిరిపోతున్నాయి. 80లు, 90ల్లో పెరిగిన వాళ్లకు నాగార్జున ఎప్పటి నుండో ఫేవరెట్. కానీ ‘కూలీ’ సినిమాతో కొత్త తరం యూత్‌కి కూడా అతని చార్మ్‌ను పరిచయం చేసింది. ఇంతకు ముందు ‘కుబేర’ సినిమాతో తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తి రగిలించిన నాగార్జున, ‘కూలీ’ తో ఆ అనుబంధాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా "ఐ యామ్ ది డేంజర్" పాట అతని కరిజ్మా, టైమ్‌లెస్ అప్పీల్‌కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ఫ్యాన్స్ అంటున్నారు.
సినిమా సెకండ్ హాఫ్‌లో నాగార్జునకు మరింత స్క్రీన్ టైమ్ ఉంటే ఇంకా జోష్‌గా ఉండేదని చాలామంది ఫీలవుతున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో కూడా అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ నాగార్జున దాన్ని సునాయాసంగా సాధించాడు. ‘కూలీ’ లో సైమన్ పాత్ర కేవలం ఒక రోల్ కాదు, అదొక ఫినామినన్! తమిళనాడులో అతనిపై పెరుగుతున్న క్రేజ్ ఇంకా ఆగేలా కనిపించడం లేదు.
-
Home
-
Menu