‘జైలర్ 2’ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన తలైవా !

‘జైలర్ 2’ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన తలైవా !
X
ఈరోజు.. ఒక ప్రెస్ ఇంటరాక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ, “'జైలర్ 2'ని 2026, జూన్ 12న విడుదల చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ చాలా బాగా జరుగుతోంది” అని ప్రకటించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో కాస్త డల్ ఫేజ్ నడుస్తున్న సమయంలో.. 'జైలర్' సినిమా ఆయనకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి, తమిళ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ అయిన 'జైలర్ 2' ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

ఈరోజు.. ఒక ప్రెస్ ఇంటరాక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ, “'జైలర్ 2'ని 2026, జూన్ 12న విడుదల చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ చాలా బాగా జరుగుతోంది” అని ప్రకటించారు. డిసెంబర్ లేదా జనవరి నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతుందని.. పోస్ట్-ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం ఉంటుందని కూడా చెబుతున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శివ రాజ్ కుమార్, మోహన్‌లాల్ మొదటి భాగం నుంచి తమ పాత్రలను ఇందులో కొనసాగించనున్నారు. మిగతా నటీనటుల గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Tags

Next Story