‘కూలీ’ లో శివకార్తికేయన్?

‘కూలీ’ లో శివకార్తికేయన్?
X
ఫ్లాష్‌బ్యాక్ సీన్‌లో యంగ్ రజనీకాంత్‌ను ఆశించగా.. ఆ రోల్‌లో హీరో శివకార్తికేయన్ కనిపించడం హాట్ టాపిక్ అయింది.

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కూలీ’ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులే ఉన్నాయి. తమిళ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌లో రజనీకాంత్ స్టైల్, మాస్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఈసారి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కేవలం స్టార్ పవర్‌పై ఆధారపడకుండా స్టోరీ, కంటెంట్‌పై ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో లోకేష్ కనగరాజ్ సినిమాలో అనూహ్య సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పాడు. ఆ మాటకు తగ్గట్టుగా ట్రైలర్‌లో ఒక షాకింగ్ డీటెయిల్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఫ్లాష్‌బ్యాక్ సీన్‌లో యంగ్ రజనీకాంత్‌ను ఆశించగా.. ఆ రోల్‌లో హీరో శివకార్తికేయన్ కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సీన్ శివకార్తికేయన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారని, అతని స్టైల్ రజనీకాంత్ మాస్ అప్పీల్‌కు కొత్త రూపం ఇస్తుందని టాక్ నడుస్తోంది.

ఈ సీన్‌ను ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని విధంగా చిత్రీకరించినట్టు లోకేష్ కనగరాజ్ చెప్పారు. రజనీకాంత్‌కు టిపికల్ యంగ్ లుక్ ఇవ్వకుండా ఈ డేరింగ్ ఎక్స్‌పెరిమెంట్ చేయడం ఫ్యాన్స్‌కు థ్రిల్‌గా అనిపిస్తోంది. ఈ ట్విస్ట్‌తో కూలీపై ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగింది. ఫిల్మ్‌మేకర్స్ కొత్త ఐడియాస్‌తో సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మలిచినట్టు కనిపిస్తోంది. రిలీజ్‌కు కొద్ది రోజులే ఉండటంతో, ఈ యంగ్ రజనీకాంత్ మూమెంట్ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story