సింబు కు జోడీగా సమంత?

సింబు - వెట్రిమారన్ కాంబినేషన్ లో తాత్కాలికంగా యస్టీఆర్ 49 అనే టైటిల్‌తో రూపొందుతున్న ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ 'వడ చెన్నై' యూనివర్స్ లో భాగమని దర్శకుడు ఇటీవల జరిగిన అవార్డు వేడుకలో స్వయంగా ధృవీకరించాడు. 'వడ చెన్నై' ఒక కల్ట్ క్లాసిక్ కావడంతో, ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
తమిళ సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. యస్టీఆర్ 49 మేకర్స్ హీరోయిన్‌గా సమంతతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇవి కార్యరూపం దాల్చితే.. సింబు అండ్ సమంత కలయికలో ఇది మొదటి సినిమా అవుతుంది.
ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది. సంచలనాత్మక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉంది. కలైపులి ఎస్. థాను 'వి క్రియేషన్స్' బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తారు. మరి సింబు అండ్ సామ్ జోడీ అభిమానుల్ని ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
-
Home
-
Menu