రవి బస్రూర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం !

కన్నడ సంగీత ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన రవి బస్రూర్ పేరు వినగానే ‘కేజీఎఫ్, సలార్’ వంటి భారీ ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి. అయితే అతడిలో ఒక అంతరంగ ప్రతిభ దాగి ఉంది. అది ఫిల్మ్ మేకింగ్. ఇప్పటికే ఐదు సినిమాలను తెరకెక్కించిన రవి.. రెండు సంవత్సరాల విరామం తరువాత ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టుతో మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నాడు.
ప్రశాంత్ నీల్ తొలి దర్శకత్వం ‘ఉగ్రం’ సినిమాతో రవి తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతడు కన్నడలో టాప్ కంపోజర్‌గా ఎదిగాడు. ఈ విజయం అతడిలో దర్శకుడ్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ‘గార్గర్ మండల, బిలిందర్, కటక, గిర్మిత్, కాదల్’ వంటి సినిమాలకు రవి బస్రూర్ దర్శకత్వం వహించాడు.
ఇప్పుడు తన 12 ఏళ్ల కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతున్నాడు రవి. కర్ణాటక చరిత్రలో ఓ ప్రతిష్టాత్మకమైన కథ ‘వీర చంద్రహాస’ ను తెరపైకి తీసుకురా బోతున్నాడు. కుంతల రాజ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ హిస్టారికల్ డ్రామాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. నాదప్రభు శివ పుట్ట సామిగా యక్షగాన కళాకారుడి పాత్రలో శివన్న కనిపించబో తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రవి, శివ రాజ్ కుమార్ పోస్టర్‌ను విడుదల చేశారు, ఇది ప్రేక్షకుల్లో పెద్ద హైప్‌ను తీసుకొచ్చింది.
ఒకవైపు సంగీత దర్శకుడిగా, మరోవైపు దర్శకుడిగా రవి బస్రూర్ నిత్యం బిజీగా ఉంటున్నారు. తన ప్యాషన్‌ను ఆచరణలో చూపుతూ రవి ఈ హిస్టారికల్ డ్రామాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
-
Home
-
Menu