రజనీ - కమల్ మల్టీస్టారర్ కు డైరెక్టర్ ఎవరు?

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా తన తదుపరి చిత్రాన్ని రెడ్ జెయింట్ ఫిల్మ్స్, కమల్ హాసన్‌కి చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కమల్ హాసన్‌తో మళ్ళీ కలిసి నటిస్తారా అని అడిగినప్పుడు, ఆయన తన కోరికను వెలిబుచ్చుతూ.. అది కథ, దర్శకుడిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
"రెడ్ జెయింట్, రాజ్‌కమల్ ఇంటర్నేషనల్‌తో నేను సినిమాలు చేయడానికి అంగీకరించాను. కానీ, దర్శకుడు, కథ ఇంకా ఫైనల్ కాలేదు. కమల్ హాసన్‌తో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూద్దాం" అని ఆయన అన్నారు.
'కూలీ' సినిమాకి రజనీకాంత్‌ని, 'విక్రమ్' సినిమాకి కమల్ హాసన్‌ని డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇంకా ఏ దర్శకుడు ఖరారు కాలేదని రజనీకాంత్ చెప్పిన మాటలతో స్పష్టమైంది. 'కూలీ' సినిమాతో లోకేష్ కనగరాజ్ పనితీరు రజనీకాంత్‌ని పూర్తిగా సంతృప్తి పరచలేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
-
Home
-
Menu