'జన నాయగన్' నుంచి పూజా లుక్ అదిరింది!

బుట్టబొమ్మ పూజా హెగ్డే 35వ బర్త్‌డే సందర్భంగా.. విజయ్ - హెచ్. వినోద్ కాంబోలో వస్తున్న 'జన నాయగన్' మూవీ మేకర్స్ ఆమె క్యారెక్టర్ లుక్‌ను, పేరును రివీల్ చేశారు. ఇందులో పూజా పేరు కాయల్. ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ తీసిన 'బీస్ట్' తర్వాత విజయ్‌తో పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకుముందు ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ మాత్రమే ఇచ్చారు.
ప్లాట్ గురించి క్లియర్‌గా తెలీదు కానీ.. విజయ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. 'పోక్కిరి, జిల్లా, తెరి' తర్వాత ఆయన ఖాకీ డ్రెస్ వేయడం ఇది నాలుగోసారి. అయితే, ఈ మూవీలో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని డైరెక్టర్ హెచ్. వినోత్ గతంలోనే చెప్పారు. పూర్తిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందు విజయ్ చేస్తున్న లాస్ట్ మూవీ ఇదే కావడంతో 'జన నాయగన్' పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి.
'జన నాయగన్' చిత్రంలో ఇంకా.. బాబీ డియోల్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మామిథా బైజు, ఇంకా.. నరైన్ వంటి బిగ్ క్యాస్ట్ ఉంది. 'వారిసు' తర్వాత ప్రకాష్ రాజ్‌తో, 'లియో' తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో విజయ్ మళ్లీ కలిసి పనిచేయడం స్పెషల్ అట్రాక్షన్. వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 9 న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
-
Home
-
Menu