11 ఏళ్ళ తర్వాత ‘ప్రేమదేశం’ బాయ్ రీఎంట్రీ !

11 ఏళ్ళ తర్వాత ‘ప్రేమదేశం’ బాయ్ రీఎంట్రీ !
X
2014లో వచ్చిన ‘అలా వధు ఒక్క రోజు’ తర్వాత అబ్బాస్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో, దాదాపు ఒక దశాబ్దం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాడు.

ఒకప్పుడు తమిళ, తెలుగు సినిమాల్లో క్రేజీ లవర్ బాయ్ అబ్బాస్. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించబోతున్నాడు. 1996లో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘ప్రేమదేశం’ లో తన హ్యాండ్సమ్ లుక్స్, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 90వ దశకం చివరలో, 2000లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి విజయాలు అందుకున్న అబ్బాస్, క్రమంగా సినిమాల నుంచి దూరమయ్యాడు. అతడి చివరి చిత్రం 2015లో వచ్చిన మలయాళ చిత్రం ‘పచ్చకల్లం’.

ఇప్పుడు.. సుమారు 11 ఏళ్ల తర్వాత, అబ్బాస్ తమిళ సినిమాలోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు మరియరాజా ఇలన్‌చెలియన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జయవర్ధనన్ నిర్మిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది.

2014లో వచ్చిన ‘అలా వధు ఒక్క రోజు’ తర్వాత అబ్బాస్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో, దాదాపు ఒక దశాబ్దం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాడు. ఇది కేవలం కమ్‌బ్యాక్ మాత్రమే కాదు, ఒకప్పుడు బలమైన ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న నటుడి సైలెంట్ రీ ఎంట్రీ.

Tags

Next Story