చెన్నైలో పూజా హెగ్డే ‘పడవ ప్రయాణం’

కోలీవుడ్‌లో ఇటీవల రజనీకాంత్ చిత్రం 'కూలీ'లో ప్రత్యేక పాటతో ఆకట్టుకున్న నటి పూజా హెగ్డే.. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె ముంబై, చెన్నై నగరాల మధ్య తరచుగా ప్రయాణిస్తోంది. ఇటీవల చెన్నైలో భారీ వర్షాల కారణంగా చాలా రోడ్లు జలమయం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూజా హెగ్డే విమానాశ్రయానికి వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడింది.
తన కారులో వరదనీటిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో వర్షపు నీటితో నిండిన రోడ్డు దృశ్యాలు కనిపిస్తాయి. దీనికి పూజా హెగ్డే "విమానాశ్రయానికి వెళ్లేందుకు ఓ చిన్న పడవ ప్రయాణం... ఈ మధ్య నాకు విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు ఆసక్తికరమైన అనుభవాలు ఎదురవుతున్నాయి" అంటూ సరదాగా క్యాప్షన్ రాసింది.
విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాల గురించి గతంలో కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ కొత్త అనుభవం అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజా షేర్ చేసిన ఈ ఇన్ స్టా స్టోరీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
-
Home
-
Menu