కోలీవుడ్ లో నెక్స్ట్ రాక్ స్టార్ ఇతడే !

సాయి అభ్యంకర్... ఈ 20 ఏళ్ల సంగీత ప్రతిభాశాలి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో తదుపరి సంచలనంగా మారబోతున్నాడు. ఇంకా తన మొదటి సినిమా రిలీజ్ కాకముందే, ఏడు భారీ ప్రాజెక్ట్‌లతో ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. అల్లు అర్జున్ - అట్లీ కాంబో ప్రాజెక్ట్, సూర్య - ఆర్‌జే బాలాజీ సినిమా, ‘ యస్టీఆర్ 49’ లాంటి క్రేజీ ఫిల్మ్స్‌తో సాయి అభ్యంకర్ సందడి చేస్తున్నాడు.
తన మొదటి సోలో సింగిల్ ‘కచ్చి సేరా’తో రాత్రికి రాత్రి స్టార్ మ్యూజిషియన్‌గా మారాడు సాయి అభ్యంకర్. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ‘ఆస కూడ’ (ప్రీతి ముఖుందన్‌తో), ‘సితిర పుతిరి’ (మీనాక్షి చౌదరితో) లాంటి హిట్ సాంగ్స్‌తో మరింత గుర్తింపు సంపాదించాడు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, ఇంకా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసిన అనుభవంతో, సాయి వేగంగా స్టార్‌డమ్‌ని అందుకున్నాడు.
పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేకపోయినా, అల్లు అర్జున్ - అట్లీ భారీ బడ్జెట్ సినిమాకి సాయి ఎంపికయ్యాడు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాకి ఏఆర్ రెహమాన్ స్థానంలో అతన్ని తీసుకున్నారు.
అంతేకాదు, తమిళ్ దర్శకత్వంలో కార్తీ సినిమాకి కూడా సైన్ చేశాడు. వీటితో పాటు, ‘డ్యూడ్’, ‘బాల్టి’, ‘బెంజ్’ లాంటి రాబోయే సినిమాలకి కూడా సాయి సంగీతం అందిస్తున్నాడు. ఒకవేళ రాబోయే ఆల్బమ్‌లతో సంగీత ప్రియులను మెప్పించగలిగితే.. సాయి అభ్యంకర్ డిమాండ్ భవిష్యత్‌లో ఆకాశమే హద్దుగా నిలుస్తుంది.
-
Home
-
Menu