నేహా శెట్టి ఆశలన్నీ తమిళ డెబ్యూ మూవీపైనే!

నేహా శెట్టి ఆశలన్నీ తమిళ డెబ్యూ  మూవీపైనే!
X
నేహా ఆశలన్నీ తన తమిళ డెబ్యూ మూవీ మీదే పెట్టుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిస్తున్న 'డ్యూడ్' సినిమాలో నేహా శెట్టి ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 24న రిలీజ్ అవుతోంది.

కెరీర్‌లో కొంత స్లో ఫేజ్ నడుస్తున్న నేహా శెట్టి, తనకి మళ్ళీ మంచి బ్రేక్ రావాలని గట్టిగా ఆశిస్తోంది. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ "ఓజీ" సినిమాలో ఆమె ఫస్ట్ ఐటమ్ సాంగ్‌లో కనిపించినా.. ఆ పాట మొదట్లో థియేటర్లలోకి రాలేదు. సినిమా విడుదలయ్యాక ఐదు రోజులు ఆగి దాన్ని యాడ్ చేశారు. అందుకే, ఆ సాంగ్ పెద్దగా ఎవరి దృష్టికీ పోలేదు, ఆమెకి మైలేజ్ కూడా ఇవ్వలేకపోయింది.

ఇక ఇప్పుడు, నేహా ఆశలన్నీ తన తమిళ డెబ్యూ మూవీ మీదే పెట్టుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిస్తున్న 'డ్యూడ్' సినిమాలో నేహా శెట్టి ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 24న రిలీజ్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ తమిళ సినీ పరిశ్రమలో యువతను ఆకట్టుకుంటున్న ప్రామిసింగ్ స్టార్లలో ఒకడు. తనతో కలిసి నటించడం నేహాకి చాలా కాన్ఫిడెన్స్‌ని ఇస్తోంది. 'డ్యూడ్ ' సినిమా హిట్ అయితే, తమిళ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె నమ్ముతోంది.

నిజానికి తెలుగులో ఆమెకి 'డీజే టిల్లు' లాంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తోనే మంచి పాపులారిటీ వచ్చింది. ఇప్పుడీ 'డ్యూడ్' కూడా దాదాపు అదే తరహా జానర్‌కి చెందిన సినిమా. అందుకే, 'డీజే టిల్లు' హిస్టరీ రిపీట్ అవుతుందని నేహా గట్టిగా ఆశ పడుతోంది.

Tags

Next Story