ఆ సినిమాలో నయనతార... అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన నటుడు

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న "టాక్సిక్" సినిమా గురించి క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ చిత్రంలో నయనతార కీలకపాత్రలో నటిస్తుందని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అక్షయ్ మాట్లాడుతూ, "ప్రస్తుతం నేను యశ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా. ఇందులో నయనతార కూడా భాగమయ్యారు. అయితే.. ఇతర వివరాల గురించి ఇప్పుడు నేను చెప్పలేను. త్వరలోనే గీతూ మోహన్‌దాస్ అధికారిక ప్రకటన చేస్తారు. అప్పటివరకు ఆగండి," అని అన్నారు. అయితే, నయనతార పాత్ర గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా నటిస్తోందని మొదట ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలపై చిత్ర బృందం స్పందిస్తూ, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని సూచించింది. "టాక్సిక్" యశ్ నటిస్తున్న 19వ సినిమా. ఈ చిత్రం "ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్" అనే ఉపశీర్షికతో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. "కేజీఎఫ్" సిరీస్ విజయాల తర్వాత యశ్ నటిస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో యూట్యూబ్‌లో విపరీతంగా వ్యూస్ సాధించింది. ఇప్పటికే విడుదలైన అక్షయ్ ఒబెరాయ్ పోస్టర్ ఈ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే "టాక్సిక్" గురించి మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.
-
Home
-
Menu