
నా అనుమతి లేకుండా నన్ను ఓవర్ గ్లామరస్ గా చూపించారు : మోహిని

1990లలో మలయాళం హీరోయిన్ మోహిని తన నటనతో బాగా పాపులర్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ నటించిన "ఆదిత్య 369", మోహన్ బాబు "డిటెక్టివ్ నారద", చిరంజీవి "హిట్లర్" వంటి తెలుగు హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఆ తర్వాత ఆమె తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, 100కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో, వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో గ్లామర్ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న మోహిని.. ఇటీవల "అవళ్ వికటన్" అనే తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో జరిగిన ఓ అసౌకర్యకరమైన అనుభవం గురించి చెప్పింది. తమిళ చిత్రం "కన్మణి"లోని "ఉడల్ తళువ" అనే గ్లామరస్, స్టీమీ సాంగ్ షూటింగ్ గురించి ఆమె మాట్లాడింది.
ఈ పాటలో ఆమెని బికినీలో చూపించారు. కానీ అది తన సమ్మతి లేకుండానే జరిగిందని తెలిపింది. ఈ సాంగ్‌ని డైరెక్టర్ ఆర్.కే. సెల్వమణి తీశారు. మోహిని చెప్పిన ఒక వాక్యం ఇలా ఉంది.. "కన్మణిలో మాత్రమే నన్ను నా సమ్మతి లేకుండా ఓవర్ గ్లామరస్‌గా చూపించారు..."ఆ కాలంలో నటీమణులు ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సవాళ్లను ఆమె ఈ ఓపెన్ కామెంట్స్ ద్వారా తెలియజేసింది.
-
Home
-
Menu