‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ ఎప్పుడంటే... !

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్‌లను సొంతం చేసుకున్న తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'డ్యూడ్’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం 2025 దీపావళికి విడుదల కానుంది. మొదట్లో ప్రదీప్ నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా దీపావళి విడుదలకే అనౌన్స్ అయింది. అయితే ఒకే హీరో నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావడం ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.
అయితే, 'డ్యూడ్' తో క్లాష్‌ను నివారించడానికి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ విడుదలను తర్వాత వాయిదా వేశారు. ఈ సినిమా డిసెంబర్ 2025లో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తాజా సమాచారం . దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఎస్.జె. సూర్య , యోగి బాబు , గౌరీ జి. కిషన్, మిస్కిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నయనతారతో కలిసి సెవెన్ స్క్రీన్ స్టూడియో కు చెందిన ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.
-
Home
-
Menu