ఈ ముగ్గురూ రిపోర్టర్స్ గా కనిపిస్తారట !

ఈ ముగ్గురూ రిపోర్టర్స్ గా కనిపిస్తారట !
X
ఈ యాక్షన్‌ డ్రామాలో స్టార్‌ డైరెక్టర్లు లోకేష్‌ కనగరాజ్‌, అట్లీ, నెల్సన్‌ దిలీప్ కుమార్ న్యూస్‌ రిపోర్టర్లుగా కనిపించ నున్నారు.

‘జన నాయకన్‌’ దళపతి విజయ్‌ చివరి తమిళ సినిమాగా నిలవనుంది. ఎందుకంటే ఆయన ఇకపై పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ భారీ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్‌-ప్రొడక్షన్‌ దశలో ఉంది. హెచ్‌.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాలకృష్ణ నటించిన హిట్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ నుంచి కొంత ప్రేరణ పొందింది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

జన నాయకన్‌ 2026 పొంగల్‌ కానుకగా.. గ్రాండ్‌గా విడుదల కానుంది. కోలీవుడ్‌ వర్గాల్లో లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ఈ యాక్షన్‌ డ్రామాలో స్టార్‌ డైరెక్టర్లు లోకేష్‌ కనగరాజ్‌, అట్లీ, నెల్సన్‌ దిలీప్ కుమార్ న్యూస్‌ రిపోర్టర్లుగా కనిపించ నున్నారు. ఈ దర్శకులు విజయ్‌తో గొప్ప స్నేహాన్ని పంచుకుంటారు. క్యామియోల కోసం వారిని సంప్రదించగానే వెంటనే ఒప్పుకున్నారని తెలుస్తోంది.

అలాగే.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ఒక పాటలో కనిపించనున్నారని సమాచారం. ఈ భారీ చిత్రంలో మమితా బైజు, బాబీ డియోల్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి, గౌతమ్‌ మీనన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శాండల్‌వుడ్‌ బ్యానర్‌ కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Tags

Next Story