‘ఖైదీ 2’ సన్నాహాల్లో లోకేశ్ కనగరాజ్ ?

‘ఖైదీ 2’ సన్నాహాల్లో లోకేశ్ కనగరాజ్ ?
X
'ఖైదీ 2' మళ్లీ పట్టాలెక్కింది. రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీ-స్టారర్ సినిమాకు సైన్ చేసినప్పటికీ, లోకేష్ కనగరాజ్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించట్లేదని తమిళ వర్గాల నుండి సమాచారం.

లోకేష్ కనగరాజ్ ఇటీవల దర్శకత్వం వహించిన 'కూలీ' సినిమాకి విమర్శలు ఎదురైనా, అది భారీగా వసూలు చేసింది. 'కూలీ' విడుదలకు ముందు, తాను 'ఖైదీ 2' ని త్వరలో తీస్తానని లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. కానీ ఆ తర్వాత.. అతడు రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఒక మల్టీ-స్టారర్ కథను వారికి వినిపించాడు. దీంతో 'ఖైదీ 2' ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

అయితే.. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం 'ఖైదీ 2' మళ్లీ పట్టాలెక్కింది. రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీ-స్టారర్ సినిమాకు సైన్ చేసినప్పటికీ, లోకేష్ కనగరాజ్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించట్లేదని తమిళ వర్గాల నుండి సమాచారం. అందుకే అతడు ఇప్పుడు 'ఖైదీ 2' స్క్రిప్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టాడు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో మొదలవుతుంది. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసి, కార్తి 'ఖైదీ 2' షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. 'డ్రీమ్ వారియర్ ఫిల్మ్స్' ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

Tags

Next Story