‘టాక్సిక్’ షూటింగ్ ను రీస్టార్ట్ చేయబోతున్న కియారా

బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ, తన హస్బెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని సంతోషకరమైన వార్తను షేర్ చేసింది. ఈ కారణంగా ఆమె సినిమా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఒక ప్రాజెక్ట్ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయింది. కానీ, లేటెస్ట్ బజ్ ఏంటంటే, ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్-ఇండియన్ మూవీ “టాక్సిక్” సినిమాను ఆమె రీ స్టార్ట్ చేయబోతోంది.
కియారా ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను కంప్లీట్ చేసేసింది. అయినప్పటికీ, ఆమె క్యారెక్టర్‌కు సంబంధించి మరికొన్ని సీన్స్‌ను షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె విజిబుల్ బేబీ బంప్‌ను ఎలా మేనేజ్ చేస్తుంది? షూటింగ్‌లో దాన్ని ఎలా కవర్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాటోగ్రఫీ ట్రిక్స్‌తోనో లేక స్పెషల్ గా డిజైన్ చేసిన కాస్ట్యూమ్ తోనో ఈ చాలెంజ్‌ను అధిగమిస్తుందేమో.
కియారాకు కంఫర్ట్‌గా ఉండేలా, షూటింగ్ లొకేషన్‌ను ముంబైకి షిఫ్ట్ చేసినట్లు టాక్. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సౌత్ స్టార్ నయనతార కూడా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. “టాక్సిక్” ఇప్పటిదాకా సృష్టించిన హైప్‌తో, ఈ మూవీ సౌత్ సినిమా లవర్స్‌తో పాటు బాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
-
Home
-
Menu