కియారా అంత పారితోషికం అందుకుందా?

కియారా అంత పారితోషికం అందుకుందా?
X
ఈ బిగ్ బడ్జెట్ పాన్-వరల్డ్ డ్రామాలో నటించేందుకు కియారా అద్వానీ భారీగా రూ. 15 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం.

కన్నడ పాన్ ఇండియా స్టార్ యశ్ నటిస్తున్న "టాక్సిక్" సినిమాకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్ వస్తూ ఉండటంతో.. ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా.. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీ తన పారితోషికంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బిగ్ బడ్జెట్ పాన్-వరల్డ్ డ్రామాలో నటించేందుకు కియారా అద్వానీ భారీగా రూ. 15 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం.

గత కొన్ని సంవత్సరాలుగా కియారా స్టార్‌ స్టేటస్ పెరగడం.. వరుస విజయాలు సాధించడం వల్ల ఈ రేంజ్‌ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ దీపికా పడుకొనే. ఆమె "కల్కి 2898 ఎ.డి" సినిమా కోసం రూ. 23 కోట్లు అందుకుంది. ఇక ఇప్పుడు "టాక్సిక్" సినిమాతో కియారా అత్యధిక పారితోషికం పొందిన కథానాయికల్లో ఒకరిగా నిలిచింది.

కియారా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" సినిమాలో హీరోయిన్ గా నటించింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో.. ఇంకా అంజలి, ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు కియారా "టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్" చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉన్నా.. నిర్మాణంలో ఆలస్యం కారణంగా పోస్ట్‌పోన్ అయ్యింది. అధికారిక విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Tags

Next Story