కోలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంటోంది !

కోలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంటోంది !
X
ఈ బ్యూటీ తాజాగా రాజేష్ ఎం సెల్వా దర్శకత్వంలో ఓ కొత్త తమిళ చిత్రంలో సైన్ చేసింది. అలాగే.. కార్తీ హీరోగా నటించే ఓ ప్రాజెక్ట్‌లో కూడా ఆమెను పరి శీలిస్తున్నారు.

కేతికా శర్మ, ఇటీవల తెలుగులో “సింగిల్” సినిమాతో సక్సెస్‌ సాధించి, టాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలను అందుకుంటోంది. అంతేకాకుండా, ఆమె ఇప్పుడు కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు అందుకుంటోంది. ఈ బ్యూటీ తాజాగా రాజేష్ ఎం సెల్వా దర్శకత్వంలో ఓ కొత్త తమిళ చిత్రంలో సైన్ చేసింది. అలాగే.. కార్తీ హీరోగా నటించే ఓ ప్రాజెక్ట్‌లో కూడా ఆమెను పరి శీలిస్తున్నారు.

దీంతో కేతికా శర్మ కోలీవుడ్‌లో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోంది. ఇప్పటికే అరడజను తెలుగు సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు తగిన గుర్తింపు పొందుతోంది. ఈ బ్రేక్‌త్రూతో కేతికా తన నటనా అవకాశాలను విస్తరించడమే కాకుండా.. మరిన్ని స్పెషల్ సాంగ్స్‌లో కూడా పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది.

Tags

Next Story