ప్రారంభం నుంచీ ఈ మూవీకి అడ్డంకులే !

ప్రారంభం నుంచీ ఈ మూవీకి అడ్డంకులే !
X
కేరళకు చెందిన టాలెంటెడ్ నటుడు ఎం.ఎఫ్. కపిల్ సౌపర్ణిక నదిలో మునిగి మృతి చెందాడు. తాజాగా.. లంచ్ బ్రేక్ సమయంలో ఆయన నదిలో ఈదేందుకు వెళ్లగా, ఆకస్మాత్తుగా వచ్చిన ప్రవాహానికి కొట్టుకుపోయారు.

ఇండియన్ బాక్సాఫీస్ ను ఊపేసిన చిత్రాలలో 'కాంతారా' ఒకటి. ఈ చిత్రం విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సంచలన విజయం అందుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయననే ప్రధాన పాత్రలో నటించారు. ఈ విజయానంతరం రిషబ్ శెట్టి 'కాంతారా'కి ప్రిక్వెల్‌గా 'కాంతారా: చాప్టర్ 1' అనే చిత్రాన్ని ప్రకటించారు.

ఈ చిత్రం 2025 అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రారంభం నుండి పలు అడ్డంకులు ఎదుర్కొంటోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేరళకు చెందిన టాలెంటెడ్ నటుడు ఎం.ఎఫ్. కపిల్ సౌపర్ణిక నదిలో మునిగి మృతి చెందాడు.

తాజాగా.. లంచ్ బ్రేక్ సమయంలో ఆయన నదిలో ఈదేందుకు వెళ్లగా, ఆకస్మాత్తుగా వచ్చిన ప్రవాహానికి కొట్టుకుపోయారు. స్థానిక పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించినప్పటికీ, కపిల్‌ను బతికించలేకపోయారు. ఇది షూటింగ్ యూనిట్‌కు తీవ్ర దెబ్బగా మారింది.

ఇంతకుముందు కూడా ఈ సినిమా షూటింగ్ వివాదాస్పద పరిణామాలను ఎదుర్కొంది. స్థానిక ఆదివాసీల నుంచి అభ్యంతరాలు, పర్యావరణానికి నష్టాన్ని కలిగించడంపై వచ్చిన విమర్శల కారణంగా షూటింగ్ ఆగిపోయింది. గత సంవత్సరం, జూనియర్ ఆర్టిస్ట్‌లను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై, పలువురు గాయపడ్డారు. ఆ సమయంలో కూడా షూటింగ్ నిలిచిపోయింది.

ఈ పరిస్థితుల్లో 'కాంతారా: చాప్టర్ 1' చిత్ర నిర్మాణం సవాళ్ల మధ్య కొనసాగుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి యథాతథంగా ఉంది. అయినప్పటికీ, వరుస అపశ్రుతులు చిత్రబృందాన్ని కలవరపెడుతున్నాయి.

Tags

Next Story