కార్తీ నెక్స్ట్ మూవీ రిలీజ్ అప్పుడే !

కార్తీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఖైదీ 2’ సీక్వెల్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ బిగ్ టికెట్ మూవీ.. కాస్త ఆలస్యం కావడంతో ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొంది. కానీ, ఇప్పుడు ఆ నిరాశను తుడిచిపెట్టేలా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ‘మెయ్యళగన్’ (సత్యం సుందరం) సినిమాతో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ స్టార్ హీరో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘వా వాద్యార్’ తో మళ్లీ హైలైట్ అవుతున్నాడు.
‘కాదలుం కడందు పోగుం’ లాంటి కల్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నలన్ కుమారస్వామి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ యాక్షన్-కామెడీ ఫ్లిక్ డిసెంబర్‌లో రిలీజ్‌కి రెడీ కానుందని టీమ్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ రాగానే ఫ్యాన్స్‌లో జోష్ మామూలుగా లేదు. ఇంకా ఖచ్చితమైన రిలీజ్ డేట్ లాక్ చేయలేదు, కానీ ఈ సినిమాలో కార్తీ ఒక సూపర్ క్విర్కీ కాప్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్‌తో అతను స్క్రీన్ మీద ఫుల్ ఎనర్జీతో సందడి చేయబోతున్నాడని టాక్. హీరోయిన్‌గా కృతి శెట్టి ఈ మూవీలో రొమాంటిక్ వైబ్‌ని యాడ్ చేస్తోంది.
ఇంక ఈ సినిమా కాస్టింగ్ విషయానికొస్తే, ఇది ప్యాక్డ్ విత్ టాలెంట్ అని చెప్పాలి. సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి.ఎం. సుందర్, రమేష్ తిలక్, పి.ఎల్. తేనప్పన్ లాంటి హెవీవెయిట్ యాక్టర్స్ ఈ మూవీలో ఉన్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ కాంబోతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయంలో ఆడియన్స్‌కి ఫుల్ ఊరమాస్ ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ.
This December, vibe so loud,
— Studio Green (@StudioGreen2) September 1, 2025
Vaathiyaar steps in, ruling the crowd! 😎🐎#VaaVaathiyaar is arriving December 2025#VaathiyaarVaraar
A #NalanKumarasamy Entertainer
A @Music_Santhosh Musical @Karthi_Offl @VaaVaathiyaar #StudioGreen @gnanavelraja007 @IamKrithiShetty #Rajkiran… pic.twitter.com/6iL71CufGK
-
Home
-
Menu