‘తుడరుం’ దర్శకుడితో కార్తి?

తమిళ టాలెంటెడ్ యాక్టర్ కార్తి ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్3’ లో కనిపించాడు. ఈ ఫ్రాంచైజ్‌లో నాల్గవ భాగంలో లీడ్ రోల్‌లో నటించనున్న అతడు.. తదుపరి 2022 సూపర్‌హిట్ చిత్రం ‘సర్దార్’ కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘సర్దార్ 2’ లో నటిస్తున్నాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది.
కార్తి అంటేనే.. ప్రత్యేకమైన స్క్రిప్ట్ ఎంపికలకు పేరుగాంచినవాడు. కోలీవుడ్ వర్గాల్లో తాజా బజ్ ప్రకారం.. ఆయన మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తితో జతకట్టనున్నాడని టాక్. తరుణ్ మూర్తి గురించి తెలియనివారికి, ఆయన అత్యధిక వసూళ్లు సాధించిన మోహన్‌లాల్ మలయాళ చిత్రం ‘తుడరుం’ దర్శకుడు.
తరుణ్ గత చిత్రాలు ‘సౌదీ వెల్లరిక్క, ఆపరేషన్ జావా’ చిత్రాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కాంబో వర్కవుట్ అయితే.. సినీ ప్రియులకు ఖచ్చితంగా ఒక అద్భుత అనుభవం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘గార్డియన్, మామన్’ చిత్రాలను నిర్మించిన లార్క్ స్టూడియోస్ నిర్మించ బోతోందని సమాచారం. మరి తరుణ్ మూర్తి కార్తి కోసం ఎలాంటి స్టోరీ తెరకెక్కిస్తాడో చూడాలి.
-
Home
-
Menu