‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్ పూర్తి !

‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్ పూర్తి !
X
కాంతారా – ఎ లెజెండ్ చాప్టర్ 1 షూటింగ్ పూర్తయింది. మేకర్స్ ఇటీవల ఒక బిహైండ్-ది-సీన్స్ వీడియోను డ్రాప్ చేశారు.

కాంతారా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసి... రిషబ్ శెట్టిని ఒక్క రాత్రిలో సూపర్‌స్టార్‌గా మార్చేసింది. ఇప్పుడు అతను తన తదుపరి బిగ్ ప్రాజెక్ట్, కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే, కాంతారా – ఎ లెజెండ్ చాప్టర్ 1 షూటింగ్ పూర్తయింది. మేకర్స్ ఇటీవల ఒక బిహైండ్-ది-సీన్స్ వీడియోను డ్రాప్ చేశారు.

సినిమా స్కేల్ చూస్తే ఈసారి రిషబ్ శెట్టి మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేశాడని క్లియర్‌గా తెలుస్తోంది. రిషబ్ శెట్టి ఈ సినిమాకి నటుడిగా, డైరెక్టర్‌గా రెండు రోల్స్‌లో రాణిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను మెగా స్కేల్‌లో నిర్మించింది, బడ్జెట్‌కు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. సినిమా విజువల్స్, సెట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని బీటీయస్ వీడియో చూస్తే అర్థమవుతుంది.

సంగీతం విషయానికొస్తే, అజనీష్ లోకనాథ్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజువల్స్‌కు లైఫ్ పోసినట్టుగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో అతని మ్యూజిక్ థ్రిల్‌ను డబుల్ చేస్తోంది. సినిమా ఎక్కువ భాగం కర్ణాటకలోని దట్టమైన అడవుల్లో షూట్ చేశారు. సెట్స్ అంటే సహజంగా, రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. కాంతారా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ కొత్త ఇన్‌స్టాల్‌మెంట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న థియేటర్లలో రిలీజ్ కానుంది.


Tags

Next Story