లోకేష్ జోడీగా రచితా రామ్ ?

లోకేష్ జోడీగా రచితా రామ్ ?
X
ఇంట్రెస్టింగ్‌గా, ఈ మూవీలో లోకేష్ యాక్షన్ హీరో అవతార్‌లో కనిపించబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం లోకేష్ హీరోయిన్ రచితా రామ్‌తో రొమాన్స్ చేయబోతున్నాడని టాక్.

ఫిల్మ్‌మేకర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్‌లో తన యాక్టింగ్ డెబ్యూ కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం లోకేష్ తన లుక్‌ని టోటల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటున్నాడు. ఇంట్రెస్టింగ్‌గా, ఈ మూవీలో లోకేష్ యాక్షన్ హీరో అవతార్‌లో కనిపించబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం లోకేష్ హీరోయిన్ రచితా రామ్‌తో రొమాన్స్ చేయబోతున్నాడని టాక్.

రచితా రామ్ లాస్ట్‌గా లోకేష్ డైరెక్ట్ చేసిన ‘కూలీ’ మూవీలో కనిపించింది. ఆమె చేసిన కల్యాణి క్యారెక్టర్ ఆడియన్స్‌తో పాటు క్రిటిక్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్యారెక్టర్ ఒక సాఫ్ట్ అండ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌గా అందరినీ ఆకట్టుకుంది. లోకేష్ ఇప్పటికే తన యాక్టింగ్ డెబ్యూ కోసం థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుని, స్టన్నింగ్ ఎంట్రీ ఇవ్వడానికి సెట్ అయ్యాడు.

ఈ సినిమాని సౌత్ ఇండియాలో ఒకే షెడ్యూల్ లో షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అయ్యాక, లోకేష్ ఆమిర్ ఖాన్‌తో తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. రచితా రామ్ ఈ ఫిల్మ్‌లో ఉందనే విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో వస్తుంది.

Tags

Next Story