కన్నడ నటి రాన్యా రావ్ అరెస్ట్.. కారణమేంటి?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని వివాదాలు కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా కన్నడ నటి రాన్యా రావ్ పేరు బంగారు స్మగ్లింగ్ కేసులో తెరపైకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా 15 కేజీల బంగారాన్ని తీసుకొచ్చిన కేసులో బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆమెను అరెస్టు చేశారు.
రాన్యా రావ్ ఇటీవల అనేకసార్లు దుబాయ్ వెళ్లి వస్తుండడంతో అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. చివరికి బంగారు బిస్కెట్లను దుస్తుల్లో దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి, ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో రాన్యా తనను డీజీపీ కుమార్తెగా పేర్కొంటూ పోలీసుల సహాయాన్ని కోరినట్టు సమాచారం.
రాన్యా పేరు ఇలా స్మగ్లింగ్ కేసులో తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె వ్యక్తిగతంగా దీని వెనుక ఉన్నారా, లేక మరెవరైనా ఈ అక్రమ వ్యవహారంలో ఉన్నారా అనే కోణంలో డీఆర్‌ఐ అధికారులు విచారణ చేస్తున్నారు. 'మాణిక్య’ సినిమాతో తెరంగేట్రం చేసిన రాన్యా, ‘వాఘా’, ‘పటాకీ’ చిత్రాలతో గుర్తింపు పొందింది.
-
Home
-
Menu