లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి జయం రవి

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి జయం రవి
X
జయం రవి ఇటీవల శివకార్తికేయన్ , సుధా కొంగర కాంబో మూవీ 'పరాశక్తి' లో విలన్‌గా నటించాడు. లోకేష్ రవి మోహన్ కోసం ఒక జోష్‌గా ఉండే పాత్రను రూపొందించినట్లు సమాచారం.

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన జీ స్క్వాడ్ బ్యానర్ కింద 'బెంజ్' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం అతను సుధన్ సుందరం, జగదీష్ పళనిసామితో కలిసి పనిచేస్తున్నాడు. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం జయం రవి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

జయం రవి ఇటీవల శివకార్తికేయన్ , సుధా కొంగర కాంబో మూవీ 'పరాశక్తి' లో విలన్‌గా నటించాడు. లోకేష్ రవి మోహన్ కోసం ఒక జోష్‌గా ఉండే పాత్రను రూపొందించినట్లు సమాచారం. అంతేకాక.. ఇతడు ఈ ఫ్రాంచైజీలోని రాబోయే చిత్రాలైన 'ఖైదీ 2. విక్రమ్ 2' లో కూడా కనిపించనున్నట్లు బజ్ నడుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

‘బెంజ్’ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ రచయిత, దర్శకుడు. ఈ సినిమా ఒక హై యాక్టెన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ పాత్ర ఉండదు. ‘బెంజ్’ గా లారెన్స్ ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తాడో అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ మూవీ అతడికి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.

Tags

Next Story