నిర్మాతగా, దర్శకుడిగా జయం రవి

నిర్మాతగా, దర్శకుడిగా జయం రవి
X
జయం రవి తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్‌ను ఒక గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేశాడు. ఈ కార్యక్రమానికి కార్తి, శివకార్తికేయన్, శ్రద్ధా శ్రీనాథ్, శివ రాజ్‌కుమార్ హాజరయ్యారు.

తమిళ హీరో జయం రవి తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్‌ను ఒక గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేశాడు. ఈ కార్యక్రమానికి కార్తి, శివకార్తికేయన్, శ్రద్ధా శ్రీనాథ్, శివ రాజ్‌కుమార్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో, రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌లో మొదటి సినిమా టైటిల్‌ “బ్రో కోడ్”గా అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో రవి మోహన్‌తో పాటు ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. దీనికి కార్తిక్ యోగి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాక.. రవి తన బ్యానర్‌లోనే దర్శకుడిగా మొదటి సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పేరు “యాన్ ఆర్డినరీ మ్యాన్”, ఇందులో యోగి బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇది రవి దర్శకుడిగా మొదటి ప్రాజెక్ట్. ఇప్పటికే రెండు సినిమాలను ప్రకటించిన రవి, నటుడు, నిర్మాత, దర్శకుడిగా తన బ్యానర్ కింద మరిన్ని చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

Tags

Next Story