శాండల్ వుడ్ లో అదిరిపోయే భారీ మల్టీస్టారర్ !

శాండల్ వుడ్ లో అదిరిపోయే భారీ మల్టీస్టారర్  !
X
శాండిల్‌వుడ్ స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, వర్సటైల్ యాక్టర్ రాజ్ బి శెట్టిలతో మల్టీస్టారర్ మూవీ ‘45’ ను తెరకెక్కిస్తున్నాడు.

కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య చిన్న గ్యాప్ తర్వాత దర్శకుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించాడు. ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసి.. శాండిల్‌వుడ్ స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, వర్సటైల్ యాక్టర్ రాజ్ బి శెట్టిలతో మల్టీస్టారర్ మూవీ ‘45’ ను తెరకెక్కిస్తున్నాడు.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శివన్న (శివ రాజ్ కుమార్), ఉప్పీ (ఉపేంద్ర) కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఉపేంద్ర ‘కబ్జా’ మూవీలో శివన్న కనిపించినప్పటికీ.. అది కేవలం క్యామియో అప్పియరెన్స్ మాత్రమే. కానీ.. ఈసారి పూర్తి స్థాయిలో ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో శాండిల్‌వుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

2023లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ‘45’ టీజర్, పోస్టర్స్ ద్వారా అభిమానుల్లో కుతూహలాన్ని పెంచిన మేకర్స్, విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 15, 2025న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. 2025లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా నిలిచిన ‘వార్ 2’ తో ‘45’ బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టనుంది. రెండు మల్టీస్టారర్ సినిమాలు పోటీ పడుతుండటంతో, విజయం ఎవరిని వరిస్తుందో చుడాలంటే ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే.

Tags

Next Story