సీక్వెల్ కోసం భారీ వార్ సీక్వెన్స్ !

సీక్వెల్  కోసం భారీ వార్ సీక్వెన్స్ !
X
2022లో విడుదలైన ‘కాంతార’ సంచలన విజయాన్ని సాధించి.. కొత్త రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు.. ఆ లెగసీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది.

రిషభ్ శెట్టి హీరోగా.. హోంబళే ఫిలింస్ నిర్మిస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022లో విడుదలైన ‘కాంతార’ సంచలన విజయాన్ని సాధించి.. కొత్త రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు.. ఆ లెగసీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్ సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఇక.. ఈసారి మేకర్స్ సినిమా స్థాయిని మరింత పెంచేందుకు భారీ యుద్ధ ఘట్టాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సీక్వెన్స్ కోసం 500 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన యోధులను నియమించారు. యాక్షన్ కొరియోగ్రాఫీ నిపుణుల నేతృత్వంలో రూపొందిస్తున్న ఈ యుద్ధ ఘట్టం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇది ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతిని అందించబోతోంది అని చెబుతున్నారు మేకర్స్.

ఈ కథ కర్ణాటకలోని కదంబ రాజవంశం నేపథ్యంలో నడుస్తుంది. కదంబులు భారతీయ చరిత్రలో ఓ కీలక శకాన్ని సూచించడమే కాకుండా.. ఆ సమయంలో విశేషమైన కళా, సాంస్కృతిక వైభవం వికసించింది. ‘కాంతార: చాప్టర్ 1’ ద్వారా ఆ కాలం సజీవంగా తెరపై ఆవిష్కారం కాబోతోంది. ఈ పౌరాణిక యుద్ధగాథ ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హోంబాళే ఫిలింస్ మరో మాస్టర్‌పీస్‌ను అందించనుందనే అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Tags

Next Story