‘ఇడ్లీ కడై’ ఫైనల్ వెర్షన్ రెడీ !

‘ఇడ్లీ కడై’ ఫైనల్ వెర్షన్ రెడీ !
X
అక్టోబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో.. రీ-రికార్డింగ్ పనులు పూర్తి కావడంతో సినిమా తుది వెర్షన్ సిద్ధమైందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం తమిళనాడులో ప్రచార పర్యటనలో బిజీగా ఉంది.

ధనుష్ దర్శకత్వం వహించిన 'ఇడ్లీ కడై' చిత్రం అక్టోబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో.. రీ-రికార్డింగ్ పనులు పూర్తి కావడంతో సినిమా తుది వెర్షన్ సిద్ధమైందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం తమిళనాడులో ప్రచార పర్యటనలో బిజీగా ఉంది. ధనుష్, అతని బృందం స్టూడియోలో ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'పా పాండి', 'రాయన్', 'నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోబం' తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో సినిమా 'ఇడ్లీ కడై'. ఇందులో 'తిరుచిత్రాంబలం'లో ఆయనతో కలిసి నటించిన నిత్యా మీనన్ కథానాయిక. అలాగే అరుణ్ విజయ్, రాజ్ కిరణ్, సత్యరాజ్, గీతా కైలాసం, సముద్రఖని, పార్థిబన్, షాలిని పాండే వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రంలో మురుగన్ (ధనుష్) తన తండ్రి ఇడ్లీ దుకాణాన్ని తిరిగి ప్రారంభించడానికి ఒక చిన్న గ్రామంలో అష్టకష్టాలు పడుతున్నట్లు అర్థమవుతుంది. దాని కోసం అతను విలన్‌గా నటించిన అశ్విన్ (అరుణ్ విజయ్)ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మురుగన్‌కు ఇడ్లీ దుకాణం ఎందుకు అంత ముఖ్యమో, అతనికి అశ్విన్‌కు మధ్య ఉన్న వైరం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ స్టూడియోస్‌తో పాటు డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం జీవీ ప్రకాష్ అందించారు. ధనుష్‌తో జీవీ ప్రకాష్ 'నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోబం'లో కూడా పని చేశారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ, ప్రసన్న జీకే ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు.

Tags

Next Story