ఫహద్ ఫాజిల్ - ప్రేమ్ కుమార్ .. వాటే కాంబో !

మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ సినిమాలు కొన్ని ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయితే.. ఇప్పుడు అతడి రాబోయే ఒక కొత్త ప్రాజెక్ట్ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తమిళ డైరెక్టర్ ప్రేమ్ కుమార్.. ఫహద్ ఫాసిల్‌తో తన తదుపరి సినిమా గురించి వెల్లడించాడు. కథ నరేషన్ పూర్తయింది. ఫహద్‌కి ఆ కథ వెంటనే నచ్చేసిందట.
"నా నెక్స్ట్ సినిమా ఫహద్ ఫాసిల్‌తో ఉంటుంది. ఇది యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ అవుతుంది. కానీ నా స్టైల్‌లో ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయి. ఫహద్‌కి 45 నిమిషాల పాటు కథ చెప్పాను. అతనికి చాలా నచ్చింది..." అని డైరెక్టర్ తెలిపాడు. ఇది నేరుగా తమిళ సినిమాగా రూపొందుతుంది. షూటింగ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది.." అని అతడు చెప్పాడు.
గత కొన్ని సంవత్సరాల్లో ఫహద్ ఫాసిల్ సోలో హిట్‌గా కేవలం 'ఆవేశం' మాత్రమే నిలిచింది. అతని ఇతర సినిమాలు 'ఇరుల్', 'జోజి', 'మాలిక్', 'మలయాంకుంజు', 'ధూమం', 'మరీసన్' వంటివి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు, అయినప్పటికీ కొన్ని సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వీటితో పాటు ఇటీవల విడుదలైన అతని ఓణం సినిమా 'ఓడుం కుదిర చాడుం కుదిర' కూడా ఫ్లాప్‌గా మిగిలింది.
ప్రేమ్ కుమార్ ఒక సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడి సినిమాలు '96' (తెలుగులో 'జాను'గా రీమేక్ అయింది), మెయ్యళగన్ ( 'సత్యం సుందరం' )మంచి హిట్స్ గా ఫ్యాన్ బేస్ సంపాదించాయి. ఆయన ఎమోషన్స్‌తో కూడిన కథలను అద్భుతంగా అల్లే స్టోరీటెల్లర్. అందుకే, ఈ కాంబినేషన్‌తో ఫహద్ ఫాసిల్ బాక్సాఫీస్ వద్ద గట్టి కమ్‌బ్యాక్ ఇస్తాడని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే.. ఫహద్ మళ్లీ బాక్సాఫీస్ గేమ్‌లో రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
-
Home
-
Menu