లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనా?

కార్తీ కెరీర్‌లో "ఖైదీ" ఒక బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అతని నటనకు కూడా విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అతను టాప్ డైరెక్టర్స్ లీగ్‌లో చేరాడు. కార్తీ, లోకేష్ ఇద్దరూ చాలా కాలం క్రితమే "ఖైదీ 2" ప్రకటించారు. కానీ లోకేష్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. కార్తీ కూడా వేరే సినిమాలతో ఆక్యుపైడ్ కావడంతో ఈ కల్ట్ ఫిల్మ్ సీక్వెల్ ఆలస్యమైంది.
"కూలీ" ప్రమోషన్స్ సమయంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ "ఖైదీ 2" అని. లోకేష్ కనగరాజ్ స్పష్టం చేశాడు. స్క్రిప్ట్ రెడీ అయిందని.. "కూలీ" రిలీజ్ అయిన వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. కార్తీ కూడా ఈ సీక్వెల్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌ని ప్రాముఖ్యంగా తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన నేపథ్యంలో, "ఖైదీ 2"ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించ నున్నారు. మేకర్స్ ఈ యాక్షన్ డ్రామా కోసం ఖర్చుకు వెనకాడకుండా ప్లాన్ చేస్తున్నారు.
-
Home
-
Menu