థాయ్ ల్యాండ్ లో ‘డెవిల్’ చివరి షెడ్యూల్ !

శాండల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ డెవిల్ చిత్రం ప్రారంభం నుంచే హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఉత్సాహం మరింత పెరిగింది. ఈ సినిమా బెంగళూరు, ఉదయపూర్‌లలో కీలకమైన 70 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఇప్పుడు చివరి షెడ్యూల్ కోసం టీమ్ థాయిలాండ్‌కు వెళ్లనుంది. మంగళవారం నుంచి ఫుకెట్, క్రాబీ, బ్యాంకాక్‌లలో 10 రోజుల పాటు సాంగ్ సీక్వెన్స్‌లు, మాంటేజ్ షాట్స్ చిత్రీకరణ జరగనుంది.
గత ఏడాది 18 రోజులు షూటింగ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ స్టార్ట్ చేసి, 70 రోజుల్లో బెంగళూరు షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేశారు. కొన్ని రోజులు 24 గంటలు నాన్‌స్టాప్‌గా వర్క్ చేశారు. ఇంటెన్స్‌గా ఉన్నా... షూటింగ్ పూర్తయింది. ‘డెవిల్’ మూవీ దర్శన్‌తో డైరెక్టర్ ప్రకాశ్ వీర్ రెండో కలబరేషన్. గతంలో వీరి తారక్ సినిమా సక్సెస్‌ఫుల్‌గా నడిచింది.
ఈ చిత్రంలో రచన రాయ్ హీరోయిన్‌గా, ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ విలన్‌గా నటిస్తున్నారు. షర్మిలా మాంద్రే, అచ్యుత్ కుమార్, వినయ్ గౌడ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓటీటీ రైట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఉంది. రిలీజ్ డేట్ గురించి స్పెక్యులేషన్స్ జోరుగా సాగుతున్నాయి. కొందరు సెప్టెంబర్ చివరిలో, మరికొందరు అక్టోబర్ లేదా డిసెంబర్‌లో రిలీజ్ అని అంచనా వేస్తున్నారు. జై మాతా కంబైన్స్ సమర్పణలో, వైష్ణో స్టూడియోస్ జయమ్మ, ప్రకాశ్ వీర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ ఎస్ రాజ్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
-
Home
-
Menu