మళ్లీ ప్రారంభం కానున్న దర్శన్ ‘డెవిల్ – ది హీరో’ షూటింగ్

కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం "డెవిల్ – ది హీరో" . ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రకాష్ వీర్ తెరకెక్కిస్తున్నారు. 2024 మార్చిలో మొదలైన ఈ సినిమా షూటింగ్, హీరో దర్శన్ జైలుకు వెళ్ళిన కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం, మార్చి 11 నుంచి మళ్లీ షూటింగ్ మొదలవనుంది. అయితే.. దర్శన్ కొంత ఆలస్యంగా టీమ్‌కి జాయిన్ అవుతారని సమాచారం.
దర్శన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్నీక్ పీక్ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాదు, ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మహేష్ మాంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక రచన రాయ్ కథానాయికగా నటించనుండగా, మరిన్ని నటీనటుల వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది. ఇదివరకు "తారక్" సినిమాతో విజయం సాధించిన దర్శన్, ప్రకాష్ వీర్ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా కావడంతో, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
జై మాతా కాంబైన్స్ సమర్పణలో వైష్ణో స్టూడియోస్ బ్యానర్‌పై జే జయమ్మ, ప్రకాష్ వీర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుధాకర్ ఎస్ రాజ్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా, అతనికి దర్శన్ చిత్రంలో ఇది తొలి ప్రాజెక్ట్. ఇప్పటికే సరేగామా మ్యూజిక్ లేబుల్ ఈ చిత్రపు ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకుంది. "డెవిల్ – ది హీరో" పూర్తిగా మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.
-
Home
-
Menu